నిలిచిపోనున్న స్కైప్ సేవలు

ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ సేవలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ఈ నెల 5 నుంచి ఈ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. 2003లో మొదటగా స్కైప్ సేవలు ప్రారంభం కాగా.. 2011లో మైక్రోసాఫ్ట్ దాన్ని కొనుగోలు చేసింది. 2017లో అదే కంపెనీ నుంచి టీమ్స్ సేవలు లాంచ్ అవటం, కరోనా అనంతరం స్కైప్ ఆదరణ తగ్గిపోయింది.