దివ్యాంగుల బస్సు పాసు కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బాలాజీ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ జిల్లాలోని అన్ని డివిజన్లలో దివ్యాంగ శక్తి కార్యక్రమం ఎలాంటి లోటు పాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.