రోహిత్.. చాలా మారిపోయావ్: నీతా అంబానీ
రేపటి నుంచి IPL 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఇవాళ జట్టును కలిసింది. ఆటగాళ్లను పలకరించే క్రమంలో రోహిత్ ఫిట్‌నెస్ చూసి ఆశ్చర్యపోయింది. 'మై గాడ్ రోహిత్, గుర్తుపట్టలేకపోయా, చాలా మారిపోయావ్' అని పేర్కొంది. ముంబైకి 5 IPL ట్రోఫీలు అందించిన రోహిత్.. వన్డే వరల్డ్ కప్ 2027 ఆడటమే లక్ష్యంగా ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే.