VIDEO: మధ్యాహ్న భోజనంలొ నీళ్ల చారు.. రోడ్డుపై విద్యార్థుల ధర్నా

VIDEO: మధ్యాహ్న భోజనంలొ నీళ్ల చారు.. రోడ్డుపై విద్యార్థుల ధర్నా

ASF: కౌటాల మండల కేంద్రంలోని ZPSS పాఠశాలలో విద్యార్థులకు ఉడికి ఉడకని అన్నం నాణ్యత లేని నీళ్ల చారుతో మధ్యాహ్న భోజనం వడ్డించారు. ప్రతీరోజు ఇదే జరగడంతో దీనికి నిరసనగా విద్యార్థులు శుక్రవారం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో పాటు నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. HM పై చర్యలు తీసుకోవాలని కోరారు.