తిరుపతి-కాట్పాడి రైలుకు తాత్కాలికంగా బ్రేక్
TPT: గుంతకల్ డివిజన్‌లో రైల్వే ట్రాక్ పనుల కారణంగా తిరుపతి-కాట్పాడి రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. రైలు నెంబర్ 16853/16854 తిరుపతి నుంచి కాకుండా, కాట్పాడి నుంచి సాయంత్రం 4:45కు బయలుదేరనుంది. మార్చి 20, 23, 27, 30, ఏప్రిల్ 3, 6, 10, 13 తేదీల్లో తిరుపతి-కాట్పాడి మధ్య పాక్షికంగా ఈ రైలును రద్దు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.