కావలిలో ఇద్దరికి ఫైన్

కావలిలో ఇద్దరికి ఫైన్

NLR: కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి బైకులు నడిపిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. రూరల్ సీఐ రాజేశ్వరరావు వారిని కావలి ప్రిన్సిపల్ సివిల్ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున ఇద్దరికి జడ్జి రూ.20వేలు జరిమానా విధించారు. మందు తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.