'ఇళ్ల స్థలాల్లో డంపింగ్ యార్డు కరెక్ట్ కాదు'
W.G: గత ప్రభుత్వ హయాంలో రుస్తుంబాధలో పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఈ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. నర్సాపురం మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పాలకులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.