నేడు పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవం
MBNR: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని రుక్మాబాయి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు ప్రణవ్ అయ్యగారు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు అభిషేకం, 10:30 గంటలకు స్వామివారి కళ్యాణం, సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు.