నియోజవకర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎమ్మెల్యేలు

ATP: రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో అభివృద్ధి విషయమై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో వారు మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల విషయమై సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.