VIDEO: 'పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి'

HNK: పట్టణ కేంద్రంలోని డబ్బాల ప్రాంతంలోని పోచమ్మ ఆలయంలో శ్రావణ మాసం చివరి ఆదివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు క్యూ కట్టారు. చీర, సారెలు, ఒడి బియ్యం సమర్పించి దర్శనం చేసుకున్నారు. శ్రావణ మాసంలో బోనం సమర్పణ ఆనవాయితీగా కొనసాగుతోందని భక్తులు తెలిపారు.