గుండ్రాంపల్లిలో పోరాట వారోత్సవాలు ప్రారంభం

గుండ్రాంపల్లిలో పోరాట వారోత్సవాలు ప్రారంభం

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద గురువారం సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఎగురవేసి వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో బొడిగె సైదులు, ఎండీ అక్బర్, జిల్లా యాదయ్య, జిల్లా సత్యం పాల్గొన్నారు.