ముత్యాలమ్మ పాలెంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

AKP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి రజని మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.