కొనుగోళ్లు ఆలస్యం.. రైతుల ఆందోళన

కొనుగోళ్లు ఆలస్యం.. రైతుల ఆందోళన

ADB: జిల్లాలో యాసంగిలో పండించిన జొన్నలను అమ్మేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన పెరిగింది. వానాకాలంలో పత్తి, సోయా పంటలు నష్టపోయిన రైతులు ఆ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకోవాలనుకున్న రైతులకు ఇప్పుడు జొన్నల విక్రయం ఆలస్యం కావడం మరో సమస్యగా మారింది.