పెండింగ్ పనుల ప్రపోజల్స్ రెడీ చేయండి: కార్పొరేటర్

మేడ్చల్: మీర్పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, HMWSSB వాటర్ వర్క్స్ మేనేజర్ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. పలు కాలనీల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరాకు సంబంధించి పెండింగ్ పనుల కోసం ప్రపోజల్స్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాలనీల సమస్యలను పరిశీలించి, సమర్థవంతంగా పనులు చేపట్టేందుకు మార్గాలను చర్చించారు.