శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు
NDL: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక వేదికపై శైలపుత్రి అమ్మవారు దివ్యమంగళరూపంలో కొలువుదీరారు. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు శ్రీభ్రమరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 మయూర వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.