మురుగునీళ్లలోనే ప్రజల జీవనం
VZM: రాజాం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాజాం,రామభద్రపురం ప్రధాన రహదారి సమీపంలోని కాలువలు, సరైన రహదారులు లేక మురుగు నీరు నిల్వవుతోంది. దీని వల్ల దుర్వాసనతో పాటు వ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.