VIDEO: 'మహిళలలో చైతన్యం వస్తేనే మార్పు'
SRD: మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆందోల్‌లో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 4039 మహిళా సంఘాలకు రూ.4.52 కోట్లు, జిల్లాలో 15909 సంఘాలకు రూ.18.25 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.