చెట్టును ఢీకొన్న కారు.. ఆరుగురికి గాయాలు
జగిత్యాల మండలంలోని తక్కలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగి వస్తున్న హనుమన్ దీక్షపరుల కారు టైరు పేలి చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్పగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.