అగ్నిప్రమాదం.. మృతుల్లో అన్నాచెల్లెళ్లు

అగ్నిప్రమాదం.. మృతుల్లో  అన్నాచెల్లెళ్లు

దక్షిణ ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ చెప్పుల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అన్నాచెల్లి ఉండటం స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.