ఊట్కూరు పాలకవర్గం ఏకగ్రీవం

ఊట్కూరు పాలకవర్గం ఏకగ్రీవం

KMM: కామేపల్లి మండల పరిధిలోని ఊట్కూరు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్‌గా వీసంశెట్టి హనుమంతరావు, ఉప సర్పంచ్‌గా కర్నాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. గ్రామంలో వేరే ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా పాలకవర్గం ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.