VIDEO: పొగాకు బ్యారెన్ వద్ద అగ్ని ప్రమాదం
ELR: బుట్టాయిగూడెం మండలం కండ్రిక గూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు బ్యారన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పొగాకు ఉడకబెట్టడానికి తీసుకువచ్చి నిల్వ ఉంచిన పుల్లల మధ్య మంటలు చెలరేగాయి. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. కాగా మంటలు ఎలా చెలరేగాయా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.