పేకాటరాయుళ్ల అరెస్టు

పేకాటరాయుళ్ల అరెస్టు

KMR :పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఎస్సై వెంకట్రావు వివరాల ప్రకారం.. పిట్లం మండలం చిన్నకొడఫ్గల్‌లో కల్లు దుకాణం వద్ద రోడ్డుపై పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసి, వారి నుంచి నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసినట్లు తెలిపారు.