నిర్లక్ష్యం వహించే రేషన్ డీలర్లను తొలగిస్తాం: జేసీ
ELR: రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహించే డీలర్లను తొలగిస్తామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ హెచ్చరించారు. ఇటీవల IVRS ఫీడ్ బ్యాక్ రేషన్ పంపిణీ తదితర విషయాలలో తక్కువ పనితీరు కనబరిచిన 45 మంది చౌకధరల దుకాణాల డీలర్లతో కలెక్టరేట్ లో మంగళవారం డీలర్ల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను ఐవీఆర్ఎస్ విధానం ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలిపారు.