పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్
ELR: పెదపాడు ఎస్సై సతీష్ సిబ్బందితో వెంపాడు గ్రామంలోని పేకాట శిబిరంపై దాడి నిర్వహించి 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,890 నగదు, 10 సెల్‌ఫోన్‌లు, 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.