VIDEO: రామప్ప ఆలయాన్ని సందర్శించిన మంత్రి
ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని గురువారం మంత్రి సీతక్క సందర్శించారు. మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శివపార్వతుల కళ్యాణ స్థలి ఏర్పాట్లు, భక్తుల కోసం పార్కింగ్ సదుపాయాలను పరిశీలించారు. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు.