VIDEO: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
WGL: రాయపర్తి మండలం సన్నూర్‌లో ప్రసిద్ధ స్వయం వక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం కూడరై మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలు, భక్తి నామస్మరణలతో మార్మోగింది.