ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నవంబర్ 5న జరిగే కార్తీక పౌర్ణమి, గిరిప్రదక్షిణ, లక్ష దీపోత్సవం,అఖండ జ్యోతి దర్శనం కార్తీక మాస ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శనివారం MLA యశస్విని రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాల్వాది మోహన్ బాబు, సూపరిండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు డీవీఆర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.