మద్దిమడుగు దేవస్థానానికి సెమీ డీలక్స్ బస్సు ప్రారంభం

మద్దిమడుగు దేవస్థానానికి సెమీ డీలక్స్ బస్సు ప్రారంభం

NLG: దేవరకొండ నుంచి మద్దిమడుగు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఏర్పాటు చేసిన సెమీ డీలక్స్ బస్సును డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు బుధవారం ప్రారంభించారు. దేవరకొండ నుంచి ఉ.9 గంటలకు బయలుదేరి డిండి, అచ్చంపేట మీదుగా మధ్యాహ్నం 12:45 గంటలకు మద్దిమడుగు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అక్కడ నుంచి మ. 2 గంటలకు బయలుదేరి సా. 5:45 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు.