చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్

TG: మంథని నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 63 గ్రామాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. భూసేకరణ కోసం మిగిలిన 1407 ఎకరాల సేకరణకు అవసరమైన రూ. 166.67 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. దీనివల్ల మహాదేవ్‌పూర్, కాటారం వంటి వెనుకబడిన ప్రాంతాల రైతులకు ఎంతో మేలు చేకూరనుంది.