స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం: దినేష్ కులాచారి

NZB: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మహాజన సంపర్క్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి ప్రతి ఇంటికి చేరుకొని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.