VIDEO: 'సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా'

VIDEO: 'సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా'

GNTR: ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే రామాంజనేయులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 82 మంది లబ్ధిదారులకు రూ.64.80 లక్షల చెక్కులను ఆయన అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన పేదలకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ప్రత్తిపాడులో సుమారు రూ.10 కోట్ల మేర సాయం అందించామన్నారు.