కార్తీక పౌర్ణమి ఉత్సవ పూజల్లో ఎమ్మెల్యే
చిత్తూరు నగరంలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. గురువారం సాయంత్రం దొడ్డిపల్లిలోని శ్రీ సప్త కనికలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.