VIDEO: జాతరలో డ్రోన్ ద్వారా భద్రతా పర్యవేక్షణ

VIDEO: జాతరలో డ్రోన్ ద్వారా భద్రతా పర్యవేక్షణ

ఏలూరులోని గంగానమ్మ జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసులు ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా జాతర ప్రాంగణంలో డ్రోన్ ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తూ, భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే ప్రజల శాంతిభద్రతల కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.