శ్రీముఖలింగం.. ఎటు నుంచి చూసిన మనల్నే చూస్తుంది..!

శ్రీముఖలింగం.. ఎటు నుంచి చూసిన మనల్నే చూస్తుంది..!

SKLM: జిల్లాలో శ్రీముఖలింగం ఆలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రెండవ రాజు కామార్ణవుడు నిర్మించారు. ఇక్కడి లింగాన్ని ఏ దిశ నుండి చూసినా మనవైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీనిని 'దక్షిణ కాశీ' అని పిలుస్తారు.