అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

KNR: తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్‌లు పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో అడ్మిషన్ల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తూ కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.