సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

కృష్ణా: సీఎం సహాయనిధి, లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ద్వారా ఎందరో పేద ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతున్నామని, మరెందరికో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలోని శాసనసభ్యుల కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు.