రోడ్డు ఆక్రమించిన దుకాణాలపై మున్సిపల్ కొరడా

రోడ్డు ఆక్రమించిన దుకాణాలపై మున్సిపల్ కొరడా

పెద్దపల్లి: మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా నుండి శ్రీపాద చౌరస్తా వరకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి పర్యవేక్షణలో ఆదివారం రోడ్డుకు ఇరువైపులా జరిగిన ఆక్రమణల కూల్చివేతల పర్వం కొనసాగింది. రోడ్డును ఆక్రమించుకొని ఉన్న ఫ్లెక్సీలు, నేమ్స్ బోర్డ్, హోటల్, పండ్ల దుకాణాల ముందు నిర్మించిన పందిళ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.