పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
జనగాం: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.