ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

కోనసీమ: కొత్తపేట మండలంలోని 8 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ఎం.హరి ప్రసాద్ తెలిపారు. గోగివరిపేట, నారాయణలంక, తొత్తుపాడు వంటి గ్రామాల్లోని పాఠశాలల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.