నేరేడువలసలో ట్రాఫిక్ ఆంక్షలు
PPM: కురుపాం మండలం, నేరేడువలస మాలతమ్మ పండుగ సందర్భంగా ఎల్విన్ పేట సర్కిల్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాయగడ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయంగా పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం మీదుగా వెళ్లాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు నేరేడువలస జంక్షన్ వద్ద కుడివైపు పార్కింగ్, కార్లు, జంక్షన్‌కు 200 మీ. ముందు ఎడమవైపు పార్కింగ్ చేయాలని కోరారు.