సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో సూచన

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో సూచన

MNCL: జనాభా లెక్కల సర్వేలో తప్పులు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో సరోజన సూచించారు. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలో జనాభా లెక్కల సూపర్వైజర్లకు, ఎన్యూమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. మండలంలోని 18 పంచాయతీల పరిధిలో జనాభా లెక్క సర్వేను త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.