సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 27 మంది లబ్ధిదారులకు 18 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని దానిలో భాగంగానే పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నమన్నారు.