విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి
WGL: విద్యుత్ షాక్‌తో ఓ వివాహిత మృతిచెందిన విషాద ఘటన నర్సంపేట పట్టణ కేంద్రంలో ఇవాళ జరిగింది. ప్రత్యూష అనే మహిళ తన ఇంటి వద్ద ఆరుబయట ఆరేసిన బట్టలు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రత్యూష 7నెలల గర్భిణీ కాగా, నేడు తన పుట్టినరోజు కూడా అని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.