వీధి దీపాలు లేక అంధకారంలో ఎస్సీ కాలనీ

వీధి దీపాలు లేక అంధకారంలో ఎస్సీ కాలనీ

BDK: ఆళ్లపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయంగా మారాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని, పాముకాటు వంటి ప్రమాదాలు జరుగుతాయని కాలనీవాసులు ఆందోళన చెందారు.