మంచి జరిగితేనే వైసీపీని ఆదరించండి

ప్రకాశం: మంచి జరిగితేనే ఓటు వేయండని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. యర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో పలు మండలాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజలను కలిశానని అన్నారు.