బాలుర వసతి గృహంలో తనిఖీలు

ELR: ఏలూరు అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. వసతి గృహంలో కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలియచేశారన్నారు. వసతి గృహానికి రానటువంటి విద్యార్థులు వివరాలు సేకరించి వారిని తిరిగి చేర్పించాలని అధికారులకు సూచించారు.