VIDEO: TRP ఆధ్వర్యంలో ఈశ్వరా చారికి నివాళి
KMR: తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో ఈశ్వరా చారి మృతికి సంతాపం తెలిపారు. శనివారం సాయి ఈశ్వరా చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్, టౌన్ ప్రెసిడెంట్ మామిళ్ల సిద్ధ రాములు, సెక్రటరీ కాషా గౌడ్, కళ్లెం రాజు, సామల వెంకటేశం పాల్గొన్నారు.