VIDEO: మధిరలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ: MRO
KMM: మధిర మండలంలో గురువారం నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మార్వో రాంబాబు అన్నారు. అభ్యర్థులు స్వయంగా నామినేషన్లు దాఖలు చేయాలని, ఇతర వ్యక్తులు వస్తే అనుమతించమని చెప్పారు. సర్పంచ్‌కు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ. 2000, SC, ST, BC అభ్యర్థులు రూ. 1,000 చెల్లించాలన్నారు.