నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
VZM: లక్కవరపుకోట మండలం మార్లపల్లి రామాలయం వద్ద ఇవాళ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నిర్వహకులు శనివారం తెలిపారు. ఈ మేరకు ఉచిత కంటి పరీక్ష తనిఖీ నిర్వహించి కంటి లోపాలు ఉన్న వారికి ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.