మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగమణి రెడ్డి

NLG: నల్గొండ పట్టణానికి చెందిన కందిమల్ల నాగమణి రెడ్డి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆమెకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగమణి రెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర అధ్యక్షురాలుకు కృతజ్ఞతలు తెలిపారు.